రోహిత్, కోహ్లీ ఫామ్‌పై సౌరవ్ గంగూలీ ఆసక్తికర కామెంట్స్

by Vinod kumar |   ( Updated:2022-05-16 17:03:08.0  )
రోహిత్, కోహ్లీ ఫామ్‌పై సౌరవ్ గంగూలీ ఆసక్తికర కామెంట్స్
X

న్యూఢిల్లీ : ఐపీఎల్ 2022 సీజన్‌లో దిగ్గజ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆటతీరుపై తాజాగా బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పందించారు.'పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ ఫామ్‌ను తిరిగి పొందుతారు. టీ20 ప్రపంచ కప్‌కు ఇంకా చాలా టైముంది. వీరు నిజంగానే మంచి, పెద్ద ఆటగాళ్లు. ఇప్పుడే కంగారు పడాల్సిన పనిలేదు. వరల్డ్ కప్ సమయానికి కోహ్లీ, రోహిత్ మళ్లీ షైన్ అవుతారు' అని గంగూలీ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా,ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆర్సీబీ క్రికెటర్ కోహ్లీ ఆడిన మొత్తం 13 మ్యాచుల్లో కేవలం 236 పరుగులు మాత్రమే చేయగా.. యావరేజ్ 19.67, స్ట్రైయిక్ రేట్ 113.46‌గా ఉంది. ఇక ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 12 మ్యాచులు ఆడి 218 పరుగులు చేయగా.. యావరేజ్ 18.17, స్ట్రైక్ రేట్ 125.29గా ఉంది.

Advertisement

Next Story

Most Viewed