ఝులన్ గోస్వామిని ప్రశంసించిన గంగూలీ

by Disha Web Desk 21 |
ఝులన్ గోస్వామిని ప్రశంసించిన గంగూలీ
X

న్యూఢిల్లీ: ఝులన్ గోస్వామి లెజెండరీ క్రికెటర్ అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రశంసించారు. గురువారం కోల్‌కతాలో జరిగిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో గంగూలీ మాట్లాడుతూ..'లండన్‌లోని లార్డ్స్ వేదికగా సెప్టెంబర్ 24న ఇంగ్లాండ్‌తో వన్డే మూడో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ ముగిసిన అనంతరం టీమ్ ఇండియా మహిళా జట్టు స్టార్ బౌలర్ ఝులన్ గోస్వామి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనుంది. ఆమె పట్ల చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఝులన్ గోస్వామితోపాటు టీమ్ ఇండియా మహిళల జట్టు అద్భుతంగా ఆడింది.

ఝులన్ ఒక లెజెండరీ క్రికెటర్. ఉమెన్స్ క్రికెట్‌ చరిత్రలో అత్యధికంగా వికెట్లు తీసిన ఘనత ఆమెకే సొంతం. నేటి యువ క్రికెటర్లకు రోల్‌ మోడల్‌గా నిలిచింది.' అని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం భారత మహిళా క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచుల్లో భారత్ ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది.

Also Read : ఆ ఫార్మాట్‌లోనే ఐపీఎల్: గంగూలీ


Next Story