గొప్ప మనసు చాటుకున్న సిరాజ్.. తన క్యాష్ ప్రైజ్ ఏం చేశాడంటే..!

by Shiva |
గొప్ప మనసు చాటుకున్న సిరాజ్.. తన క్యాష్ ప్రైజ్ ఏం చేశాడంటే..!
X

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా కప్ ఫైనల్ లో మహమ్మద్ సిరాజ్ సూపర్ బౌలింగ్ తో టీమిండియా శ్రీలంక జట్టును 10 వికేట్ల తేడాతో ఓడించి ఆసియా కప్ ను ఎగరేసుకుపోయింది. ఫైనల్ తో అద్భుత ప్రదర్శన కనబరిచిన సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఈ క్రమంలోనే అతను గొప్ప మనసు చాటుకున్నాడు. తనకు వచ్చిన క్యాష్ ప్రైజ్ ను కొలంబో గ్రౌండ్స్ మెన్ ఇచ్చేశాడు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక వెంటవెంటనే ఓపెనర్లను కోల్సోయింది. ఈ క్రమంలో బౌలింగ్ కు దిగిన సిరాజ్ ఏకంగా ఓకే ఓవర్ లో నాలుగు వికెట్లు పడగొట్టాడు.

ఇన్సింగ్స్ మొత్తంలో 7 ఓవర్లు వేసి 21 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు. మ్యాచ్ అనంతరం సిరాజ్ మాట్లాడుతూ.. 'చాలా రోజులుగా నేను మెరుగ్గా బౌలింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా. పిచ్ ఆరంభం నుంచే స్వింగ్ కు అనుకూలిస్తుంది. ఫుల్ లెంగ్త్ బాల్స్ వేయాలని డిసైడ్ అయ్యాను. అది పర్ఫెక్ట్ గా వర్క్ అవుటైంది. నాకు వచ్చిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ క్యాష్ ప్రైజ్ ను గ్రౌండ్ స్టాఫ్ కు ఇచ్చేస్తున్నా. ఎందుకంటే వారు మ్యాచ్ ల నిర్వహణకు అహర్నిషలు కృషి చేశారు. వారు లేకపోతే ఇదంతా జరిగేదే కాదు' అని అన్నాడు.

Next Story

Most Viewed