హాస్పిటల్‌లో చేరిన శార్దూల్ ఠాకూర్.. అతనికి ఏమైంది?

by Harish |
హాస్పిటల్‌లో చేరిన శార్దూల్ ఠాకూర్.. అతనికి ఏమైంది?
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కుడి కాలు పాదానికి సర్జరీ చేయించుకున్నాడు. ఈ విషయాన్ని శార్దూల్ బుధవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. హాస్పిటల్‌లో ఉన్న ఫొటోను పోస్టు చేసిన అతను సర్జరీ విజయవంతమైందని తెలిపాడు. కొంతకాలంగా చీలమండల నొప్పితో బాధపడుతున్న అతను లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు.

శార్దూల్‌కు సర్జరీ జరగడం ఇది రెండోసారి. 2019లో అతను తొలిసారిగా పాదం సర్జరీ చేయించుకున్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో అతని గాయం మళ్లీ తిరగబెట్టింది. ఐపీఎల్‌లో ఇంజక్షన్ తీసుకుని పాల్గొన్నాడని, అయినప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోవడంతో సర్జరీ చేయించుకున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ మోకాలికి సర్జరీ చేసిన డాక్టరే శార్దూల్‌కు శస్త్ర చికిత్స చేసినట్టు తెలిపాయి. శార్దూల్ కోలుకుని శిక్షణ ప్రారంభించడానికి దాదాపు మూడు నెలలు పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఐపీఎల్ చెన్నయ్ తరపున 9 మ్యాచ్‌లు ఆడిన శార్దూల్ కేవలం ఐదు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.Next Story

Most Viewed