Sachin : సచిన్ ను వదలని డీప్ ఫేక్.. స్పందించిన మాస్టర్ బ్లాస్టర్

by Mahesh |
Sachin : సచిన్ ను వదలని డీప్ ఫేక్.. స్పందించిన మాస్టర్ బ్లాస్టర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రోజుకో కొత్త టెక్నాలజీ అబ్బురపరుస్తుంటే ఆ టెక్నాలజీ మాటున సైబర్ నేరగాళ్లు, ఆకతాయియిల చేష్టలు అందరికీ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల పలువురు సెలబ్రెటీలను డీఫ్ ఫేక్ భయపెడుతోంది. తాజాగా భారత మాజీ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ వీడియో వైరల్ గా మారింది. ఓ గేమింగ్ యాప్ కు సచిన ప్రచారం చేస్తున్నట్లు ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో ఈ వీడియో పై రియాక్ట్ అయిన సచిన్ ఇది ఫేక్ వీడియో అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) లో స్పందించిన ఆయన.. ఈ వీడియోలు నకిలీవి. టెక్నాలజీని విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వీడియోలు, ప్రకటనలు ఎక్కడ కనిపించినా వెంటనే రిపోర్ట్ కొట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సోషల్ మీడియా సంస్థలు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఫిర్యాదులపై స్పందించాలన్నారు. తప్పుడు సమాచారం మరియు డీప్‌ఫేక్‌ల వ్యాప్తిని ఆపడానికి వారి వైపు నుండి వేగవంతమైన చర్యలు అత్యంత కీలకం అన్నారు.

Advertisement

Next Story

Most Viewed