రోహిత్, కోహ్లి లేకుండానే సౌతాఫ్రికాకు టీమిండియా

by Anjali |
రోహిత్, కోహ్లి లేకుండానే సౌతాఫ్రికాకు టీమిండియా
X

దిశ, వెబ్‌డెస్క్: సౌతాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్‌లను ఆడటానికి రీసెంట్‌గా టీమిండియాను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ సిరీస్ కోసం టీమిండియా సౌతాఫ్రికాకు బయలుదేరింది. కోహ్లి, రోహిత్, పేసర్ మహమ్మద్ షమీ పలువురు సీనియర్ ప్లేయర్స్ లేకుండానే బెంగళూరు ఎయిర్‌పోర్ట్ నుంచి టీమిండియా క్రికెటర్లు సౌతాఫ్రికాకు పయనమైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇందులో సూర్యకుమార్ యాదవ్‌, అర్షదీప్ సింగ్‌, తిలక్ వర్మ, సిరాజ్‌తో పలువురు యంగ్ ప్లేయర్స్ ఫ్లైట్ జర్నీలో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇక షమీకీ వరల్డ్ కప్ సమయంలో యాంకిల్ గాయంతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ షమీ అత్యధిక వికెట్లు తీసుకుని సంచలనం సృష్టించాడు. ఈయన ప్రస్తుతం మెడికల్ ట్రీట్‌మెంట్ తీసుకున్నాడు. టెస్ట్ సిరీస్ సమయానికి కోలుకుని టీంలో చేరుతాడా? లేదా? అనేది చూడాలి.

Advertisement

Next Story

Most Viewed