కోహ్లీ ఫ్యాన్స్‌కు భారీ షాక్.. ఆర్సీబీ జట్టు కెప్టెన్‌గా యువ ప్లేయర్ నియామకం

by Mahesh |
కోహ్లీ ఫ్యాన్స్‌కు భారీ షాక్.. ఆర్సీబీ జట్టు కెప్టెన్‌గా యువ ప్లేయర్ నియామకం
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 సీజన్ కు సంబంధించిన వేలం ఇటీవల ముగిసింది. ఈ వేలంలో ఆర్సీబీ జట్టు (RCB team) కీలక ప్లేయర్లను వదులుకొని మరికొంతమంది కొత్త ప్లేయర్లను జట్టులోకి తీసుకుంది. అయితే ఈ సీజన్ లో ఆర్సీబీ కెప్టెన్ (RCB captain) గా విరాట్ కోహ్లీ (Virat Kohli) కొనసాగుతాడని అనేక రిపోర్ట్స్ అంచనా వేశాయి. కానీ చివరకు ఈ రోజు ఆర్సీబీ కొత్త కెప్టెన్ (RCB new captain) గా యువ ప్లేయర్ (young player) రజత్ పాటిదార్ (Rajat Patidar) ను నియమిస్తున్నట్లు ఈ రోజు ప్రకటించింది. ఇందులో భాగంగా ఆర్సీబీ అధికారిక ట్విట్టర్ (Official Twitter of RCB) లో రజత్ పాటిదర్ ను కొత్త కెప్టెన్ గా ఎన్నుకున్నట్లు అనౌన్స్ చేసింది. దీంతో RCBకి నాయకత్వం వహించే ఎనిమిదో ఆటగాడిగా రజత్ పాటిదార్ ((Rajat Patidar)) అవతరించాడు.

కొత్త కెప్టెన్ పై విరాట్ కోహ్లీ స్పందన

ఆర్సీబీ కొత్త కెప్టెన్ (RCB new captain) గా రజత్ పాటిదర్‌ను ఎన్నుకొవడంపై ఆ జట్టు స్టార్, కీలక ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) వెంటనే స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఓ విడియోను విడుదల చేశారు. "నేను నా ఇతర జట్టు సభ్యులు మీ వెంటే ఉంటాం, రజత్" "నువ్వు ఈ ఫ్రాంచైజీలో ఎదిగిన విధానం, గత సీజన్లలో నువ్వు ప్రదర్శించిన విధానం RCB అభిమానులందరి హృదయాల్లో స్థానం సంపాదించారు. ఈరోజు నువ్వు ఆర్సీబీ (RCB) జట్టు సారధిగా నీ నియామకం అర్హమైనది. అని చెప్పుకొచ్చారు.

రజత్ పాటిదార్ గురించి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్‌గా ఎన్నికన 31 ఏళ్ల మిడిల్ ఆర్డర్ బ్యాటర్. 2021లో ఐపీఎల్ లోకి ఎంట్రీ (Entry into IPL) ఇచ్చిన అతను ఇప్పటి వరకు ఆర్సీబీ తరుఫున 27 మ్యాచులు ఆడాడు. మొత్తం అన్ని ఇన్నింగ్స్‌లలో కలిపి 799 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌ను ఫైనల్‌కు చేర్చాడు. దీంతో ఆర్సీబీ ఈ నిర్ణయం తీసుకుంది. విరాట్ కోహ్లీ, యష్ దయాల్ కాకుండా మెగా వేలానికి ముందు RCB అతన్ని 11 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది.

Next Story

Most Viewed