టీమ్ ఇండియా స్పిన్నర్ అరుదైన ఘనత.. మూడో బౌలర్‌గా..

by Disha Web Desk 13 |
టీమ్ ఇండియా స్పిన్నర్ అరుదైన ఘనత.. మూడో బౌలర్‌గా..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. రెండో రోజు ఆటలో ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ ని అవుట్ చేయడంతో.. అశ్విన్‌కు 688వ అంతర్జాతీయ వికెట్ తీశాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో టీమ్ ఇండియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా నిలిచాడు.

ఈ ఇన్నింగ్స్‌లో అశ్విన్ 44 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్‌ను దాటేసి అశ్విన్ మూడో స్థానానికి చేరుకున్నాడు. కపిల్ దేవ్ తన కెరీర్‌లో మొత్తం 687 అంతర్జాతీయ వికెట్లు తీసుకున్నాడు. ఇప్పుడు అశ్విన్ ఈ సంఖ్యను దాటేశాడు. అతని కన్నా ముందు హర్భజన్ సింగ్ (707), అనిల్ కుంబ్లే (953) ఉన్నారు. అశ్విన్ ఇటీవలే టెస్టు క్రికెట్‌లో 450 వికెట్ల మార్కును దాటిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed