ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్‌ క్లీన్‌ స్వీప్‌..

by Vinod kumar |
ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్‌ క్లీన్‌ స్వీప్‌..
X

దిశ, వెబ్‌డెస్క్: ICC Rankingsలో ఏ విభాగంలో చూసుకున్నా భారత జైత్రయాత్రను ఏ జట్టూ అడ్డుకోవడంలేదు. సీనియర్లే కాదు యువ భారత జట్టు కూడా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపుతున్నారు. టీమిండియా యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ ఇటీవలే స్వదేశంలో ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టి.. పొట్టి క్రికెట్‌ ర్యాంకింగ్స్‌లో ఏకంగా అగ్రస్థానానికి దూసుకెళ్లడం గమనార్హం. బిష్ణోయ్‌.. 699 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. టీ20లలోకి గత ఏడాది అరంగేంట్రం చేసిన బిష్ణోయ్‌.. ఇప్పటివరకూ 21 టీ20 మ్యాచ్‌లలో 34 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో రషీద్‌ ఖాన్‌ (692), వనిందు హసరంగ (679), అదిల్‌ రషీద్‌ (679), మహీశ్‌ తీక్షణ (677)లు టాప్‌-5లో నిలిచారు. బ్యాటర్ల లిస్ట్‌లో.. సూర్యకుమార్‌ యాదవ్‌.. 855 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. మహ్మద్‌ రిజ్వాన్‌, ఎయిడెన్‌ మార్క్‌రమ్‌, బాబర్‌ ఆజమ్‌, రిలీ రూసోలు టాప్‌-5లో చోటు దక్కించుకున్నారు. ఆసీస్‌తో సిరీస్‌లో సెంచరీ చేసిన రుతరాజ్‌ గైక్వాడ్‌.. 688 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. యశస్వి జైస్వాల్‌.. 16 స్థానాలు మెరుగుపరుచుకుని 19వ స్థానానికి చేరాడు.

అన్నింటా మనమే నెంబర్‌ వన్‌..

తాజా ర్యాంకింగ్స్‌ ప్రకారం.. దాదాపు అన్ని విభాగాలలో భారత్‌ ఆధిపత్యం స్పష్టంగా ఉంది. మూడు ఫార్మాట్లలోనూ భారత్‌ నెంబర్‌ వన్‌ టీమ్‌ కాగా వన్డేలలో నెంబర్‌ వన్‌ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌‌గా కొనసాగుతున్నాడు. టెస్టులలో నెంబర్‌ వన్‌ బౌలర్‌ అశ్విన్‌, టెస్టు ఆల్‌ రౌండర్‌ జడేజా అన్న సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed