అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్..

by Vinod kumar |
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్..
X

దిశ, వెబ్‌డెస్క్: సౌతాఫ్రికా క్రికెటర్‌ థియునిస్‌ డి బ్రూన్‌ 30 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆరేళ్ల ‍కెరీర్‌లో కేవలం 13 టెస్ట్‌లు, 2 టీ20లు మాత్రమే ఆడిన డి బ్రూన్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. డి బ్రూన్‌ రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని అతని దేశవాలీ టీమ్‌ టైటాన్స్‌ వెల్లడించింది. 2017లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగ్రేటం చేసిన డి బ్రూన్‌.. గతేడాది చివరలో ఆస్ట్రేలియాపై తన చివరి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాడు. ఆ తర్వాత సరైన అవకాశాలు రాక జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు.

టెస్ట్‌ల్లో 19.5 సగటున 468 పరుగులు చేసిన డి బ్రూన్‌ .. 2018 లో శ్రీలంకపై తొలి సెంచరీ చేశాడు. రెండు టీ20 మ్యాచ్ లో 26 పరుగులు చేశాడు. ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా టీ20 లీగ్‌ తొలి ఎడిషన్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ టోర్నీలో క్యాపిటల్స్‌ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ టోర్నీలో 238 పరుగులు చేసిన డి బ్రూన్‌.. సెకెండ్‌ హైయెస్ట్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచారు.

Next Story

Most Viewed