యువ బ్యాటర్ ద్రువ్ జూరేల్ పై ప్రశంసల వర్షం..

by Disha Web Desk 12 |
యువ బ్యాటర్ ద్రువ్ జూరేల్ పై ప్రశంసల వర్షం..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఇంగ్టాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టుమ్యాచ్‌లో ఇంగ్లాండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని చేదించి.. ఐదు వికెట్ల తేడాతో గెలిచి, ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌ను.. 3-1 తేడాతో కైవసం చేసుకుంది. కాగా ఈ నాలుగో టెస్ట్ మ్యాచ్ విజయంలో యువ బ్యాటర్ అయిన ద్రువ్ జూరేల్ కీలక పాత్ర పోషించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆలైట్ స్టేజీలో ఉన్న భారత్‌ను కుల్దీప్ తో కలిసి 300 పరుగుల వరకు తీసుకెళ్లారు. ఈ మ్యాచ్ లో భారత్ 10 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేయగా ఇందులో జూరేల్ 90 పరుగులతో వీరోచితంగా పోరాడాడు.

అనూహ్యంగా జట్టులో అవకాశం దక్కించుకున్న అతను ఇంగ్లాండ్ బౌలర్లను పటిష్ఠంగా ఎదుర్కోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ సమయంలో.. వికెట్ల వెనుక మెరుపు వేగంతో కదులుతూ.. కీలకమైన క్యాచ్ లు తీసుకుని.. మాజీ కెప్టెన్ ధోని ని తలపించాడు. అలాగే రెండో ఇన్నింగ్స్‌లోను కీలక సమయంలో 37 పరుగులతో పాటు మ్యాచ్ విన్నింగ్ పరుగులు చేశాడు. దీంతో వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్న జూరేల్ పై సీనియర్ క్రికెటర్లతో పాటు.. విశ్లేషకులు, క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Next Story

Most Viewed