Paralympics 2024: పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట.. ఆర్చరీలో స్వర్ణం గెలిచిన హర్విందర్ సింగ్

by Maddikunta Saikiran |
Paralympics 2024: పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట.. ఆర్చరీలో స్వర్ణం గెలిచిన హర్విందర్ సింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: పారిస్‌(Paris) వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌(Paralympics)లో భారత అథ్లెట్లు దుమ్ముదులుపుతున్నారు. టీం ఇండియా ఇప్పటివరకు 21 మెడల్స్ గెలుచుకోగా తాజాగా మరో మెడల్ భారత్ ఖాతాలో చేరింది.దీంతో ఈ క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 22కు చేరుకుంది.ఇదిలాఉంటే.. బుధవారం జరిగిన పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ఈవెంట్ లో భారత ఆర్చర్ హర్విందర్ సింగ్(Harvinder Singh) బంగారు పతకం సాధించాడు.ఫైనల్లో పొలాండ్(Poland) అథ్లెట్ లుకాస్జ్ సిస్జెక్‌(Lukasz Ciszek)పై 6-0 తేడాతో ఘన విజయం సాధించాడు. దీంతో పారాలింపిక్స్‌ చరిత్రలో గోల్డ్ మెడల్ గెలిచిన తొలి భారత ఆర్చర్‌గా హర్విందర్ సింగ్ రికార్డు సృష్టించారు. కాగా, ఒలింపిక్స్ గేమ్స్‌లోనూ ఆర్చరీ విభాగంలో భారత్‌కు ఇప్పటివరకు గోల్డ్ మెడల్ రాలేదు.

Advertisement

Next Story

Most Viewed