ఒక్క మ్యాచ్ 12 రికార్డులు బద్దలు..

by Disha Web Desk 12 |
ఒక్క మ్యాచ్ 12 రికార్డులు బద్దలు..
X

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టీ20లో మొత్తం 12 రికార్డులు బద్దలయ్యాయి. సెంచురియన్ గ్రౌండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఏ ఏ రికార్డులు బద్దలయ్యాయి కొత్తగా ఏ ఏ రికార్డులు నమోదయ్యయో కింద చూడండి..

* T20I గేమ్‌లో అత్యధిక పరుగుల (517 పరుగులు)

*ఒకే మ్యాచ్ లో అత్యధికంగా 81 బౌండరీలు నమోదు..

*ఒకే మ్యాచ్ లో రెండు జట్లు తమ వ్యక్తిగత అత్యధిక స్కోరు నమోదు చేసుకున్నారు.

*అత్యధిక పరుగులు చేజింగ్ చేసిన జట్టుగా దక్షిణాఫ్రికా రికార్డు సృష్టించింది.

*ఒక్క మ్యాచ్ లో అత్యధికంగా 35 సిక్సర్లు కొట్టారు. టీ20 క్రికెట్ లో ఇదే అధికం..

*వెస్టిండీస్ బ్యాటర్ జాన్సన్ చార్లెస్ 39 బంతుల్లో సెంచరీ కొట్టి ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. అలాగే గతంలో క్రిస్ గేల్ 47 బంతుల్లో 100 పరుగుల రికార్డును జాన్సన్ చార్లెస్ బద్దలు కొట్టాడు.

*మొదటి 15 బంతుల్లోనే క్వింటన్ డికాక్ అర్ధ సెంచరీ చేసి రికార్డులోకి ఎక్కాడు.

* అత్యంత వేగంగా అర్ధసెంచరీ సాధించిన దక్షిణాఫ్రికా ప్లేయర్‌గా డి కాక్ రికార్డ్‌లోకి ఎక్కాడు.

*కేవలం మొదటి 6 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా 102 పరుగులు చేసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. కాగా వెస్టిండీస్ 2021లో శ్రీలంకపై 98 పరుగుల పవర్‌ప్లే రికార్డును కలిగి ఉంది.

*టీ20 క్రికెట్ చరిత్రలోనే మొదటి 10 ఓవర్లలో 149 పరుగు చేసి రికార్డు బద్దలు కొట్టారు.

* అలాగే ఈ మ్యాచ్ లో కేవలం బౌండరీలతోనే 394 పరుగులు చేశారు. ఇందులో 45 సిక్సర్లు, 46 ఫోర్లు ఉన్నాయి. కేవలం బౌండరీలతో ఇన్ని పరుగులు చేయడం T20Iలో అత్యధికం.

*చిట్టచివరగా.. క్వింటన్ డికాక్ మేరుపు షాట్లకు బంతులు బౌండరీల వైపు దూసుకెళ్లాయి. దీంతో వాటిని ఆపేందుకు ప్రయత్నించిన రోవ్‌మాన్ పావెల్ ఇద్దరు బాల్ బాయ్‌లను ఢీకొట్టాడు.



Next Story

Most Viewed