- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
ఏటీపీ ఫైనల్స్ టైటిల్ జకోదే

టురిన్: సెర్బియా స్టార్ టెన్నిస్ ప్లేయర్, పురుషుల సింగిల్స్ వరల్డ్ నం.1 నోవాక్ జకోవిచ్ ఈ సీజన్‌ను ఘనంగా ముగించారు. టెన్నిస్‌లో చివరి టోర్నీ అయిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్(ఏటీపీ) ఫైనల్స్ టైటిల్‌ను గెలుచుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జకోవిచ్ 6-3, 6-3 తేడాతో ఇటలీ ప్లేయర్ జెన్నిక్ సిన్నర్‌పై విజయం సాధించాడు. గంటా 43 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో జకో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు.
ఇటలీ ఆటగాడిని నిలువరించి వరుసగా రెండు సెట్లను సొంతం చేసుకుని విజేతగా నిలిచారు. జకో కెరీర్‌లో ఇది 7వ ఏటీపీ ఫైనల్స్ టైటిల్. అంతేకాకుండా, తన కెరీర్‌లో 40వ మాస్టర్స్ 1000 టైటిల్ కూడా. అలాగే, ఈ విజయంతో జకోవిచ్ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 400 వారాలు వరల్డ్ నం.1 ర్యాంక్‌లో నిలిచిన ఆటగాడిగా గుర్తింపు పొందారు. అతను ఇప్పటికే అత్యధిక వారాలు టాప్ పొజిషన్‌లో ఉన్న ప్లేయర్‌గా నిలిచారు.
ఈ సీజన్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ గెలుచుకున్నారు. 24 గ్రాండ్‌స్లామ్స్‌తో అత్యధిక గ్రాండ్‌స్లామ్ నెగ్గిన ఆటగాడిగా జకోవిచ్ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.