ధోనీ ఇల్లును చూడటానికి ఎగబడుతున్న అభిమానులు.. ఎందుకో తెలుస్తే వావ్ అంటారు

by Harish |
ధోనీ ఇల్లును చూడటానికి ఎగబడుతున్న అభిమానులు.. ఎందుకో తెలుస్తే వావ్ అంటారు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ ఇల్లు సెల్ఫీ స్పాట్‌గా మారింది. రాంచీలోని హర్ములోని ధోనీ నివాసం అభిమానులను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ధోనీ కుటుంబంతో కలిసి రాంచీలోని ఫామ్ హౌస్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే, ఇటీవల హర్ములోని ఇల్లు గోడను ప్రత్యేకంగా మేకోవర్ చేయించాడు. పైభాగంలో తన జెర్సీ నం.7తోపాటు తన ఫేవరెట్ హెలికాప్టర్ షాట్‌ చిత్రాలతో డిజైన్ చేయించాడు. అలాగే,మరోవైపు తన ఐకానిక్ షాట్లు, కీపింగ్ యాక్షన్స్‌తో ప్రత్యేకంగా గ్లాస్‌వాల్‌ను రూపొందించాడు. దీంతో ధోనీ ఇల్లు వద్ద ఫొటోలు దిగడానికి ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. జెర్సీ నం.7తో ధోనీకి వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ప్రత్యేక అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ధోనీ పుట్టిన తేదీ 7. పుట్టిన నెల 7(జూలై). భారత్‌‌కు ఆడేటప్పుడు తన జెర్సీ నం.7. ఐపీఎల్‌లోనూ సీఎస్కే తరపున అదే జెర్సీ ధరిస్తున్నాడు. ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బీసీసీఐ నం.7 జెర్సీకి రిటైర్మెంట్ ఇచ్చింది. ధోనీ సేవలను గౌరవించేలా ఇతర ప్లేయర్లకు ఆ జెర్సీ ధరించకుండా ఉండటానికి బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.






Next Story