ఆస్ట్రేలియాతో మ్యాచులకు సంజు శాంసన్‌కు నో ఛాన్స్.. ఫ్యాన్స్ ఫైర్

by Mahesh |
ఆస్ట్రేలియాతో మ్యాచులకు సంజు శాంసన్‌కు నో ఛాన్స్.. ఫ్యాన్స్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య త్వరలో వన్డే మ్యాచుల సిరీస్ జరగనుంది. ప్రపంచకప్ ముందు కీలకం కానున్న ఈ సిరీస్ లో కూడా సంజు శాంసన్‌కు జట్టులో అవకాశం దక్కలేదు. తాజాగా చైనాలో జరగనున్న ఆసియా గేమ్స్ జట్టు నుంచి శాంసన్ ను తప్పించారు. అయితే అందరూ.. అతనికి ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ లో అవకాశం వస్తుందని బావించారు కానీ అతని చివరి నిమిషంలో అవకాశం రాలేదు. దీనిపై స్పందించిన శాంసన్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా "అయిందేదో అయింది. ఇకపై నా ఆటను నేను కొనసాగించడే నా పని అని తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. శాంసన్‌కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. వారంత ఇప్పుడు తమ అభిమాన ప్లేయర్ కు అర్హత ఉన్న అవకాశం రావడంలేదని.. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ అజిత్ అగార్కర్‌ను టార్గెట్‌గా చేసుకుని కామెంట్లు చేస్తున్నారు.



Next Story