అథ్లెట్లకు టాప్స్ పథకం కింద ఆర్థికసాయం.. ప్రకటించిన క్రీడామంత్రిత్వ శాఖ

by Shamantha N |
అథ్లెట్లకు టాప్స్ పథకం కింద ఆర్థికసాయం.. ప్రకటించిన క్రీడామంత్రిత్వ శాఖ
X

దిశ, స్పోర్ట్స్: విదేశాల్లో శిక్షణ పొందేందుకు ఆర్థిక సాయం కావాలని టాప్ అథ్లెట్లు చేసిన వినతికి అంగీకారం తెలిపింది క్రీడామంత్రిత్వ శాఖ. బాక్సర్ నిఖత్ జరీన్, లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్, టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రాతో సహా పలువురు అథ్లెట్లు క్రీడాశాఖను ఆశ్రయించారు. విదేశాల్లో శిక్షణకు సాయం కావాలని కోరారు. అథ్లెట్ల వినతికి అంగీకారం తెలిపింది క్రీడాశాఖ. అథ్లెట్లందరికీ టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం కింద సాయం అందిస్తున్నట్లు తెలిపారు అధికారులు. విదేశాల్లో శిక్షణ పొందేందుకు ప్లేయర్లు, కోచ్ లకు అయ్యే ఖర్చులను కేంద్రమే భరించనుంది.

బాక్సర్లు నిఖత్, ప్రీతి పవార్, పర్వీన్ హుడా, లవ్లీనా బోర్గోహైన్ లు శిక్షణ కోసం టర్కీ వెళ్లనున్నారు. తమ కోచ్‌లు, ఫిజియోతో పాటు టర్కీలో శిక్షణ పొందేందుకు వెళ్తున్నట్లు ప్రకటించింది క్రీడామంత్రిత్వశాఖ. రెజ్లర్లు సుజీత్, దీపక్ పునియా, నవీన్ లు ఆసియా ఒలింపిక్ క్వాలికేషన్ టోర్నమెంట్ శిక్షణ కోసం రష్యా వెళ్లనున్నారు. వారితో పాటే కోచ్ లు, ఫిజియోలు రష్యా వెళ్లనున్నారు.

షాట్‌గన్ షూటర్ భౌనీష్ మెండిరట్టా పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించారు. బాకులో జరిగే ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ కోసం శిక్షణ పొందేందుకు కోచ్ తో పాటు ఇటలీ వెళ్లనున్నారు. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత శ్రీశంకర్ సుజౌ కు ఫండింగ్ క్లియర్ అయ్యింది. దోహాలో జరిగే డైమండ్ లీగ్ లో పోటీ చేయాలని ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది క్రీడాశాఖ. శ్రీశంకర్ కోట్, సైకాలజిస్ట్ లకు అయ్యే ఖర్చులను టాప్స్ భరిస్తుంది.

క్రొయేషియాలో జరిగే వరల్డ్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ కోసం టీటీ స్టార్ మనికా బత్రాకు ఆర్థిక సాయం అందింది. చెక్ రిపబ్లిక్‌లోని హవిరోవ్‌లో జరిగే వరల్డ్ మిక్స్‌డ్ డబుల్స్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆమెతోపాటు కోచ్ కూడా వెళ్లనున్నాడు. ఇకపోతే ముగ్గురు షూటర్లు అనంత్ జీత్ సింగ్ నరుకా, రైజా థిల్లాన్, రాజేశ్వరి కుమార్ సహా పారా బ్యాడ్మింటర్ ప్లేయర్ పలక్ కోహ్లీ కూడా టాప్స్ ద్వారా ఫండింగ్ అందనుంది.



Next Story

Most Viewed