లక్నోపై చెన్నై ఓటమి.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన చెన్నై కోచ్..!

by Dishanational6 |
లక్నోపై చెన్నై ఓటమి.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన చెన్నై కోచ్..!
X

దిశ, స్పోర్ట్స్: లక్నో చేతిలో చెన్నై జట్టు ఓటమిని చవిచూసింది. ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో మూడు పరుగులు మిగిలి ఉండగానే 211 పరుగుల లక్ష్యాన్ని లక్నో ఛేదించింది. అయితే.. ఈ మ్యాచ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందన్నాడు స్టీఫెన్ ఫ్లెమింగ్. గైక్వాడ్ సెంటరీ చేసిన ఓడిపోవడం బాధాకరం అని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ లో తమ ప్లాన్స్ హిట్ అవ్వలేదని తెలిపాడు. సరైన కాంబినేషన్ ఇంకా కుదరలేదని.. దానికోసమే ప్రయత్నిస్తున్నామని అన్నాడు.

గైక్వాడ్ అద్భుతంగా ఆడాడని తెలిపాడు. ఇదే ఫామ్‌ను టోర్నీ మొత్తం కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో పైచేయి సాధించలేకపోయామన్నాడు. ప్రతిసారి గొప్పగా ఆడేందుకే ప్రయత్నిస్తామన్నాడు. సీనియర్ బౌలర్ ముస్తాఫిజుల్ ప్లేస్ లో ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నామన్నాడు. బ్యాటింగ్ లో సరైన కాంబినేషన్ కోసం చూస్తున్నామన్నాడు. అందుకే, ఎక్స్ పరిమెంట్స్ చేస్తూ పోతున్నామన్నాడు. ఫ్యూచర్ కోసమే డెసిషన్స్ తీసుకుంటామన్నాడు. లక్నోతో మ్యాచ్ టైంలో పిచ్ పై మంచు ప్రభావం చూపిందన్నాడు. స్టోయినిస్ తమపై ఆధిపత్యం ప్రదర్శించాడని పేర్కొన్నాడు. ప్రెజర్ లో కొన్ని తప్పిదాలకు పాల్పడ్డామన్నాడు ఫ్లెమింగ్.

Next Story