వింబుల్డన్‌లో వాళ్లను కూడా ఆడించాలి : ఆండీ ముర్రే

by Disha Web Desk 13 |
వింబుల్డన్‌లో వాళ్లను కూడా ఆడించాలి : ఆండీ ముర్రే
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది వింబుల్డన్‌లో రష్యా, బెలారస్ ఆటగాళ్లు ఆడేందుకు నిర్వాహకులు అనుమతిస్తారని ఆండీ ముర్రే ఆశాభావం వ్యక్తం చేశాడు. గతేడాది ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఆ ఆటగాళ్లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ నిర్వహిస్తున్నామన్న వ్యాఖ్యలకు స్పందించిన ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్ (ఏఈఎల్‌టీసీ) ఆ రెండు దేశాల ఆటగాళ్లపై నిషేధపు వేటు వేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలోబెలారస్ కీలకపాత్ర పోషించింది.

బ్రిటీష్ గవర్నమెంట్ ఇచ్చిన గైడెన్స్ వల్ల మాకు కనిపించిన ఏకైక మార్గం ఆ రెండు దేశాల ఆటగాళ్లపై నిషేధం విధించడమని ఏఈఎల్‌టీసీ పేర్కొంది. ‘ఇది చాలా కఠినమైన నిర్ణయం. ఆ ఆటగాళ్లు గతేడాది ఆడకపోవడంతో నేను కూడా ఫీలయ్యాను. కానీ, ఎందుకు వింబుల్డన్ ఇటువంటి కఠినమైన నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చిందని ఆలోచిస్తే.. పరిస్థితులను కూడా అర్థం చేసుకున్నాను. నా ఉద్దేశమేంటంటే వాళ్లను కూడా ఈ ఏడాది ఆడించాలి. ఒకవేళ నిర్వాహకులు వేరే మార్గం గుండా వెళ్లినా నేను వాళ్లను అర్థం చేసుకోగలను’ ముర్రే అన్నాడు.

Also Read...

ఇద్దరు ఫుట్‌బాల్ మ్యాచ్ అధికారులకు జైలు శిక్ష.. ఇండోనేషియా కోర్టు సంచలన తీర్పు

Next Story