ఐపీఎల్ నియమాలు ఉల్లంఘించిన ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్..

by Javid Pasha |
ఐపీఎల్ నియమాలు ఉల్లంఘించిన ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్ మాథ్యూవేడ్ ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నాడు. అయితే వాంఖడే మైదానంలో జరిగిన టైటాన్స్ vs ఆర్‌సీబీ మ్యాచ్‌లో వేడ్ ఐపీఎల్ నియమనిబంధనలను ఉల్లంఘించాడని ఐపీఎల్ బోర్డు తెలిపింది. ఈ మ్యాచ్‌లో వేడ్ ఎల్‌బీడబ్ల్యూ అయి పెవిలియన్‌కు చేరుకున్నాడు. వికెట్ కోల్పోవడంతో తీవ్ర అసహానానికి గురైన వేడ్ తన హెల్మెట్, బ్యాట్‌ను కోపంగా విసిరేయడం కెమెరాకు చిక్కింది. దాన్ని గమనించిన ఐపీఎల్ బోర్డు తమ నిబంధనలను ఉల్లంఘించాడని వేడ్‌ను మందలించింది. ఈ విషయంలో వేడ్ తన తప్పును అంగీకరించాడని బోర్డు పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed