మాతో ఆడేందుకు చాలా జట్లు భయపడతాయి.. మొయీల్ అలీ హాట్ కామెంట్స్..

by Disha Web |
మాతో ఆడేందుకు చాలా జట్లు భయపడతాయి.. మొయీల్ అలీ హాట్ కామెంట్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ కప్‌లో తమతో ఆడేందుకు చాలా టీమ్‌లు భయపడతాయంటూ ఇంగ్లండ్ స్టాండ్-ఇన్ కీపర్ మొయిన్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. 4-3 తేడాతో సిరీస్ గెలిచిన అనంతరం మాట్లాడుతూ మొయిన్ అలీ ఈ తరహా వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు ప్రస్తుతం చాలా ప్రమాదకరంగా ఉందని, తమతో ఆడేందుకు కూడా చాలా టీమ్‌లు భయపడతాయని చెప్పుకొచ్చాడు. తమతో ఆడి గెలిచే అవకాశం ఉన్న జట్లు చాలా తక్కువ ఉన్నాయంటూ అన్నాడు. 'మా జట్టు అద్భుతమైన పొజిషన్‌లో ఉంది. ఇప్పుడు వరల్డ్ కప్‌లో ఆడేందుకు వెళ్తున్నాం' అని మోయిలీ అన్నాడు. వరల్డ్ కప్ టోర్నీలో తమ జట్టు విశ్వరూపం చూపిస్తామని, పాకిస్తాన్‌తో జరిగిన ఏడో టీ20 మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో విజయం సాధించామని తెలిపాడు.

Next Story

Most Viewed