‘హండ్రెడ్’ లీగ్‌కు స్మృతి మంధాన, రిచా ఘోష్ ఎంపిక

by Harish |
‘హండ్రెడ్’ లీగ్‌కు స్మృతి మంధాన, రిచా ఘోష్ ఎంపిక
X

దిశ, స్పోర్ట్స్ : లండన్‌లో జరగబోయే హండ్రెడ్ లీగ్‌లో భారత మహిళా స్టార్ క్రికెటర్లు స్మృతి మంధాన, రిచా ఘోష్ మరోసారి మెరవనున్నారు. జూలైలో ఈ టోర్నీ ప్రారంభకానుండగా.. లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్ల డ్రాఫ్‌ను నిర్వాహకులు గురువారం రిలీజ్ చేశారు. అందులో భారత్ నుంచి స్మృతి మంధాన, రిచా ఘోష్‌లకు మాత్రమే చోటు దక్కింది. హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, శ్రేయాంక పాటిల్‌తోపాటు భారత్‌ నుంచి మొత్తం 17 మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. సౌథరన్ బ్రేవ్ జట్టుకు స్మృతి మంధాన మరోసారి ప్రాతినిధ్యం వహించనుంది. గత సీజన్‌లో మంధాన అదే జట్టు తరపున ఆడింది. బర్మింగ్‌హామ్ ఫోనిక్స్‌ తరపున రిచా ఘోష్ ఆడనుంది. గత సీజన్‌లో ఆమె లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed