గౌతమ్ గంభీర్‌కు మమతా బెనర్జీ థ్యాంక్స్ చెప్పాల్సిందే..!

by Rajesh |
గౌతమ్ గంభీర్‌కు మమతా బెనర్జీ థ్యాంక్స్ చెప్పాల్సిందే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-17వ సీజన్ విజేతగా నిలిచిన కేకేఆర్ జట్టుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా స్పెషల్ విషెస్ చెప్పారు. ‘కోల్‌కతా నైట్ రైడర్స్ గెలుపు బెంగాల్ వ్యాప్తంగా సెలబ్రేషన్స్ తీసుకువచ్చిందన్నారు. ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా ఆటగాళ్ల రికార్డు బ్రేకింగ్ పర్ఫామెన్స్‌కు ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, ఫ్రాంచైజీలకు కంగ్రాచ్యూలేషన్స్ తెలిపారు. రానున్న సీజన్‌లలో కూడా విజయ బావుట మోగించాలని కాంక్షించారు.’ అయితే మమతా ట్వీట్‌కు కొంత మంది నెటిజన్లు మాత్రం బీజేపీ కోచ్ గౌతమ్ గంభీర్‌కు థ్యాంక్స్ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ఎక్స్ ఎంపీ కోల్‌కతా టీమ్‌ను సరిగ్గా గైడ్ చేశాడని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. ‘మోడీ కా పరివార్’ కోల్‌కతా జట్టుకు ట్రోఫీ తెచ్చిపెట్టిందంటూ వరుస కామెంట్లు పెడుతున్నారు.

Next Story

Most Viewed