లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో గంభీర్‌తో వివాదం.. శ్రీ‌శాంత్‌కు లీగ‌ల్ నోటీసులు

by Vinod kumar |
లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో గంభీర్‌తో వివాదం.. శ్రీ‌శాంత్‌కు లీగ‌ల్ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో గుజ‌రాత్ జెయింట్స్‌ పేస‌ర్ శ్రీ‌శాంత్‌, ఇండియ‌న్ క్యాపిట‌ల్స్ ఓపెన‌ర్ గౌతం గంభీర్ మ‌ధ్య గొడ‌వ తీవ్రస్థాయికి చేరిన విష‌యం తెలిసిందే. మ్యాచ్ అనంత‌రం శ్రీ‌శాంత్ సోష‌ల్‌ మీడియా వేదిక‌గా గంభీర్‌ను విమ‌ర్శిస్తూ పోస్ట్‌లు పెట్టడంతో మ‌రింత అగ్గి రాజుకుంది. అయితే.. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ క‌మిష‌న‌ర్ శ్రీ‌శాంత్‌కు లీగ‌ల్ నోటీసులు పంపించారు. శ్రీ‌శాంత్‌ కాంట్రాక్ట్ ఉల్లంఘ‌న‌కు పాల్పడ్డాడ‌ని. అందుకే నోటీసులు పంపామని క‌మిష‌న‌ర్ తెలిపారు. అంతేకాదు సోష‌ల్‌మీడియాలో అత‌డు పెట్టిన అన్ని పోస్ట్‌లు తొల‌గించేంత వ‌ర‌కూ ఎలాంటి చ‌ర్చలు జ‌ర‌ప‌బోమ‌ని ఎల్ఎల్‌సీ క‌మిష‌న‌ర్ తేల్చి చెప్పారు.

ఎల్ఎల్‌సీ ఎలిమినీటేర్‌లో భాగంగా బుధ‌వారం ఇండియా క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో గంభీర్ త‌న‌ను ఫిక్సర్.. ఫిక్సర్ అని తిట్టాడ‌ని అందుక‌నే అత‌డిని కోపంగా చూశాన‌ని శ్రీ‌శాంత్ తెలిపాడు. ‘నేను గంభీర్ ఒక్క చెడ్డ మాట కూడా అన‌లేదు. నువ్వు ఏం అంటున్నావు అని అత‌డిని అడిగానంతే. కానీ, గౌతీ మాత్రం ప‌దే ప‌దే న‌న్ను ఫిక్సర్ ఫ‌కింగ్ ఫిక్సర్ అంటూ దుర్భాష‌లాడాడు’ అని మ్యాచ్ అనంత‌రం శ్రీ‌శాంత్ వెల్లడించాడు. టీమిండియా పేస‌ర్‌గా రాణిస్తున్న స‌మ‌యంలోనే శ్రీ‌శాంత్ ఫిక్సింగ్ కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మ‌య్యాడు. 2013 ఐపీఎల్ ఎడిష‌న్‌లో శ్రీ‌శాంత్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. దాంతో, బీసీసీఐ అత‌డిపై నిషేధం విధించింది. ఈ మ‌ధ్యే కేర‌ళ కోర్టు శ్రీ‌శాంత్‌పై నిషేధాన్ని ఎత్తి వేసింది. ప్రస్తుతం అంత‌ర్జాతీయ టీ20 లీగ్స్‌లో ఆడుతున్నాడు.



Next Story

Most Viewed