ఆర్సీబీతో కీలక మ్యాచ్.. ప్లేఆఫ్స్‌ బెర్త్ కోసం గుజరాత్ పోరు

by Disha Web Desk 1 |
ఆర్సీబీతో కీలక మ్యాచ్.. ప్లేఆఫ్స్‌ బెర్త్ కోసం గుజరాత్ పోరు
X

దిశ, వెబ్ డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో తొలిదశ పోటీలు తుది అంకానికి చేరుకుంటున్నాయి. లీగ్ లో ఇక మిగిలి ఉన్నది ఐదు మ్యాచ్ లే. ఇప్పటికే ముంబై ప్లే ఆఫ్ బెర్త్ ను ఖాయం చేసుకోగా, తరువాతి స్థానం కోసం ఢిల్లీ, యూపీ, గుజరాత్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కొద్దిసేపటి క్రితమే ముంబై - యూపీ మధ్య ముగిసిన మ్యాచ్ లో యూపీ గెలవడంతో ఆర్సీబీ ఈ లీగ్ నుంచి అధికారికంగా ప్లేఆఫ్స్ నుంచి తప్పుకుంది. ఈ నేపథ్యంలో నేడు ఆర్సీబీతో మ్యాచ్ లో గుజరాత్ గెలిస్తే ప్లేఆఫ్స్ రేసులో యూపీతో పోటీ పడొచ్చు. ఒకవేళ ఆర్సీబీ గెలిస్తే అప్పుడు యూపీ ప్లే ఆఫ్స్ కు చేరవచ్చు.

కాగా, బ్రబోర్న్ స్టేడియం వేదికగా ఆర్సీబీ - గుజరాత్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో స్నేహ్ రాణా సారథ్యంలోని గుజరాత్ జెయింట్స్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ బౌలింగ్ కు రానుంది. ఆడిన ఆరు మ్యాచ్ లలో ఐదింటిలోనూ ఓడిన ఆర్సీబీకి ఈ మ్యాచ్ లో గెలిచినా ఓడినా పెద్ద ఉపయోగమేమీ లేదు. కానీ, గుజరాత్ కు ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాలి. నేటి మ్యాచ్ లో గెలిచి రేపు యూపీతో మ్యాచ్ లో కూడా విజయం సాధిస్తే అప్పుడు రెండో స్థానంలో ఉన్న జట్టుతో గుజరాత్ ప్లేఆఫ్స్ మ్యాచ్ ఆడనుంది.

పాయింట్ల పట్టికలో ముంబై ప్లేఆఫ్స్ కు క్వాలిఫై అవగా రెండో స్థానంలో ఢిల్లీ 8 పాయింట్లు, యూపీ 6 పాయింట్లు, గుజరాత్ 4 పాయింట్లతో ఉన్నాయి. నేటి మ్యాచ్ లో గుజరాత్ గెలిస్తే ఆ జట్టుకు ఆరు పాయింట్లు దక్కుతాయి. అయితే, నెట్ రన్ రేట్ లో మాత్రం గుజరాత్, యూపీ కన్నా దారుణంగా ఉంది. నేటి మ్యాచ్ లో భారీ స్కోరు సాధించి ఆర్సీబీని తక్కువకు ఆలౌట్ చేస్తే నెట్ రన్ రేట్ కూడా పెరుగుతుంది.

తుది జట్లు ఇలా..

బెంగళూరు : స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎలీస్ పెర్రీ, హెథర్ నైట్, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్, కనిక అహుజా, దిశా కసత్, మేగన్ షుట్, ఆశా శోభన, ప్రీతి బోస్.

గుజరాత్ : సోఫీ డంక్లీ, లారా వోల్వార్డ్, హర్లీన్ డియోల్, ఆష్లే గార్డ్‌నర్, డి.హేమలత, స్నేహ్ రాణా (కెప్టెన్), సుష్మా వర్మ, తనూజా కన్వర్, సబ్బినేని మేఘన, కిమ్ గార్త్, అశ్వని కుమారి.


Next Story

Most Viewed