టీ20 ప్రపంచ కప్ నుంచి న్యూజిలాండ్ ఎలిమినేట్.. సంచలన నిర్ణయం తీసుకున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్

by Mahesh |
టీ20 ప్రపంచ కప్ నుంచి న్యూజిలాండ్ ఎలిమినేట్.. సంచలన నిర్ణయం తీసుకున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 టీ20 ప్రపంచ కప్ నుంచి టాప్ టీమ్ అయిన న్యూజిలాండ్ ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. గత సీజన్లో ఫైనల్ వరకు వెళ్లి రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్ జట్టు ఈ సీజన్ లో అనుకున్నంత రాణించలేకపోయింది. ప్లేయర్ల పేలవమైన ఫామ్ కి తోడు వర్షం కారణంగా కివీస్ జట్టు ఎలిమినేట్ అయింది. దీనికి భాధ్యతగా కెప్టెన్ విలియమ్సన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తమ జట్టు ఓటమికి బాధ్యత వహిస్తూ పరిమిత ఓవర్ల ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అలాగే 2024-25 కాలానికి సంబంధించి న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్టును కూడా కేన్ విలియమ్సన్ వదులుకున్నాడు. కాగా గతంలో ఆయన టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా వదులుకున్న సంగతి తెలిసిందే. అయితే సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి వైదొలిగిన విలియమ్సన్ ప్లేయర్ గా ఆడుతాడా లేదా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఐపీఎల్ లో సన్రైజర్స్ జట్టు కెప్టెన్ ఉన్న సమయంలో విలియమ్సన్ కు మంచి పేరు వచ్చింది. నేటికి అతన్ని బెస్ట్ కెప్టెన్ గా జీరో హేటర్స్ మ్యాన్ గా పిలుస్తుంటారు.Next Story

Most Viewed