రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ప్లేయర్

by Dishanational4 |
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ప్లేయర్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా ఆల్‌రౌండర్ జోగిందర్ శర్మ తన క్రికెట్ కెరీర్‌కు స్వస్తి పలికాడు. జోగిందర్ శర్మ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు శుక్రవారం అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపాడు. 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన ఈ ప్లేయర్.. చివరగా 2007లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.

2007లో టీ20 ప్రపంచకప్‌ భారత్ గెలవడంలో ఈ ఆటగాడు ప్రధాన పాత్ర పోషించాడు. ఇక, అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో టీమిండియా తరఫున మొత్తం 4 టీ20లు, 4 వన్డేలు ఆడాడు. వన్డేల్లో జోగిందర్ శర్మ 4.6 ఎకానమీతో 1 వికెట్ తీశాడు. అదే సమయంలో టీ20 ఫార్మాట్‌లో 9.52 ఎకానమీతో మొత్తం 4 వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా జోగిందర్ శర్మ 16 ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా ఆడాడు. అతను చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. జోగిందర్ తనకు 15 సంవత్సరాలకు పైగా క్రీడలో ఆడే అవకాశం కల్పించినందుకు ఐసీసీ, బీసీసీఐ, హర్యానా క్రికెట్ అసోసియేషన్‌కు ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ వేదికగా రిటైర్మైంట్ ప్రకటించాడు.



Next Story

Most Viewed