మహ్మద్ సిరాజ్ పై ప్రశంసలు కురిపించిన జక్కన్న..

by Disha Web Desk 1 |
మహ్మద్ సిరాజ్ పై ప్రశంసలు కురిపించిన జక్కన్న..
X

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా కప్ ఫైనల్ లో టీమిండియా శ్రీలంక జట్టును 10 వికేట్ల తేడాతో ఓడించి టైటిల్ ను కైవసం చేసుకుంది. టోలచౌకి కుర్రాడు బౌలర్ మహమ్మద్ సిరాజ్ తన బౌలింగ్ తో లంకను కకావికలం చేశాడు. 21 పరుగులు ఇచ్చి ఏకంగా 6 వికెట్లను పడగొట్టాడు. శ్రీలంకను 50 పరుగులకు కట్టడి చేయడంలో భారత పేసర్లు హార్దిక్, బుమ్రాలు తమ వంతు సహకారన్ని అందజేశారు. ఓకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి శ్రీలంక జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్ పై దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించాడు. టోలిచౌకి కుర్రాడు ఆరు వికెట్లను పడగొట్టి అద్భుతమైన బౌలింగ్ చేశాడంటూ కొనియాడారు. సోషల్ మీడియాలో రాజమౌళి సిరాజ్ మియాన్ మన టోలిచౌకి కుర్రాడు ఆసియా కప్ ఫైనల్లో ఆరు వికెట్లు పడగొట్టాడు అంటూ ట్విట్ చేశారు. తన వేసిన బంతిని బౌండరీ వెళ్లకుండా లాంగ్ ఆన్ వరకు పరిగెత్తి అందరి హృదయాలను గెలిచాడంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్టు నెట్టింట్లో వైరల్ అవుతోంది


Next Story

Most Viewed