Chandrayaan-3: విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టిన చంద్రయాన్-3

by Disha Web Desk 13 |
Chandrayaan-3: విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టిన చంద్రయాన్-3
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ అరుదైన రికార్డును చంద్రయాన్-3 ప్రయోగం బ్రేక్ చేసింది. ఆగస్టు 23న భారత కృతిమ ఉపగ్రహం చంద్రయాన్-3 చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అయితే ఈ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చేసిన ట్వీట్ ఇప్పుడు సరికొత్త రికార్డు నమోదు చేసింది. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ఇస్రో.. 'చంద్రయాన్-3 మిషన్: 'భారత్.. నేను నా లక్ష్యాన్ని చేరుకున్నాను. మీరు కూడా!': చంద్రయాన్-3 చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. కంగ్రాట్స్ ఇండియా' అంటూ ట్వీట్ చేసింది. అయితే అతి తక్కువ సమయంలోనే ఈ ట్వీట్ అత్యధిక మిలియన్ల వ్యూస్‌తో పాటు అత్యధిక లైక్స్ సొంతం చేసుకుంది.

భారత్‌లో అత్యధిక లైక్స్ అందుకున్న ట్వీట్‌గా చరిత్రకెక్కింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్వీట్ రికార్డును చంద్రయాన్-3 అధిగమించింది. టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్‌పై అసాధారణ ఇన్నింగ్స్‌ ఆడిన విరాట్ కోహ్లీ భారత్‌కు చిరస్మరణీయ విజయాన్నందించాడు. 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లీ.. క్రికెట్ చరిత్రలోనే కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ అనంతరం 'స్పెషల్ విన్. వేల సంఖ్యలో విచ్చేసిన అభిమానులకు థ్యాంక్యూ' అంటూ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు 796 వేల లైక్స్ వచ్చాయి.

భారత్‌లో అత్యధిక లైక్స్ రాబట్టిన ట్వీట్‌గా ఇది నిలిచిపోయింది. అయితే తాజాగా చంద్రయాన్-3 ఈ రికార్డును బ్రేక్ చేసింది. ఇస్రో చేసిన ట్వీట్‌కు 839.9 వేల లైక్స్ వచ్చాయి. యూట్యూబ్‌లో కూడా చంద్రయాన్-3 సరికొత్త రికార్డును లిఖించింది. చంద్రయాన్-3 ల్యాండ్ అవ్వడాన్ని యూట్యూబ్‌లో 68 లక్షల మందికి పైగా ప్రత్యక్షంగా వీక్షించారు. అంతకుముందు 2022 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను 61 లక్షల మంది వీక్షించగా, ఆ రికార్డును ఇస్రో చంద్రయాన్-3 బ్రేక్ చేసేసింది.


Next Story

Most Viewed