ఐపీఎల్ 2025.. క్వాలిఫైయర్, సెమిస్, ఫైనల్ మ్యాచుల వేదికలు ఇవే

by Mahesh |
ఐపీఎల్ 2025.. క్వాలిఫైయర్, సెమిస్, ఫైనల్ మ్యాచుల వేదికలు ఇవే
X

దిశ, వెబ్‌డెస్క్: 2025 ఐపీఎల్ (2025 IPL) కోసం క్రికెట్ అభిమానులు (Cricket fans) ఎంతగానో వేచి చూస్తున్న క్రమంలో ఫిబ్రవరి 16న ఐపీఎల్ 18వ సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ (BCCI) విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం మొదటి మ్యాచ్ మార్చి 22 ప్రారంభం కానుండగా.. చివరి మ్యాచ్ మే 25న జరగనుంది. మొత్తం 74 మ్యాచులు 65 రోజులు పాటు 13 వేదికల్లో జరగనున్నాయి. ఇందులో మొదటి మ్యాచులో కేకేఆర్, ఆర్సీబీ జట్లు తలపడనుండగా రెండో మ్యాచులో.. హైదరాబాద్, రాజస్థాన్ జట్లు తలపడుతాయి. ఈ సారి ఆర్సీబీ, చెన్నై జట్లు రెండు స్లారు తలపడనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

అయితే ఈ ఐపీఎల్ లో అత్యంత కీలక అయిన చివరి నాలుగు మ్యాచులు క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, సెమిస్, ఫైనల్ మ్యాచుల వేదికలను ముందు సీజన్ లో విన్నర్, రన్నర్ గా నిలిచిన జట్ల వేదికల్లో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా.. చివరి నాలుగు మ్యాచులకు హైదరాబాద్ (Hyderabad), కోల్‌కతా (Kolkata)లు వేదికలు కానున్నాయి. మొదట క్వాలిఫైయర్-1 మ్యాచ్ మే 20న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం (Uppal Stadium)లో జరగనుంది. అలాగే ఎలిమినేటర్ 1 మే 21 ఉప్పల్ స్టేడియంలోనే జరగనుండగా.. క్వాలిఫయర్ 2 మ్యాచ్ మే 23న ఫైనల్ మ్యాచ్ మే 25న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ (Eden Gardens)లో నిర్వహించనున్నట్లు బీసీసీఐ ఈవాల ప్రకట్రింది. దీంతో హైదరాబాద్ వేదికగా ఈ సారి మొత్తం 9 మ్యాచులు జరగనున్నాయి.

Next Story

Most Viewed