- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
INDvAUS: గుడ్‌న్యూస్.. రాత్రి 7 గంటల నుండి ఆన్ లైన్‌లో టిక్కెట్లు

దిశ, వెబ్‌డెస్క్: భారత్ vs ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్లు అమ్మడంలో హెచ్‌సీఏ ఘోరంగా విఫలమైంది. టికెట్ల కోసం అభిమానులు భారీ ఎత్తున సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్ వద్దకు చేరుకున్నప్పటికీ.. హెచ్‌సీఏ కనీస సౌకర్యాలు కల్పించలేదు. దీంతో గ్రౌండ్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పరిస్థితి అదుపు తప్పడంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఒక్కసారిగా అభిమానులు చెల్లాచెదురు కావడంతో తొక్కిసలాట జరిగింది.
పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో జింఖానా గ్రౌండ్ వద్ద టిక్కెట్ విక్రయాలను అధికారులు నిలిపివేశారు. టికెట్లు అయిపోయినట్లు ప్రకటించడంతో అభిమానులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. అయితే, రాత్రి 7 గంటల నుండి పేటీఎం ఇన్ సైడర్ యాప్‌లో ఆన్ లైన్ టిక్కెట్లు అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ముందుగానే ఆన్ లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి ఫిజికల్ టిక్కెట్లు ఇస్తారా.. లేదా కొత్తగా టిక్కెట్లు విక్రయిస్తారా అనేది అర్థం కాక అభిమానులు అయోమయంలో ఉన్నారు.