పారా ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. రెండు రోజుల్లో 35 పతకాలు

by Disha Web Desk 12 |
పారా ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. రెండు రోజుల్లో 35 పతకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా గేమ్స్ 2023లో అదరగొట్టిన భారత ప్లేయర్లు.. పారా ఆసియా గేమ్స్ లో కూడా సత్తా చాటుతున్నారు. మొదటి రోజు 24 పతకాలతో మెరవగా.. రెండో రోజు కూడా భారత్ సత్తా చాటింది. మొత్తంగా భారత్ 10 బంగారు పతకాలు, 12 సిల్వర్ మెడల్స్, 13 బ్రాంజ్ మెడల్స్ సాధించింది. రెండు రోజుల్లో మొత్తం 35 పతకాలు సాధించిన భారత్ పారా ఆసియా క్రీడల పతకాల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. అలాగే మూడో రోజు కూడా పలు కీలక గేమ్స్ లో భారత ప్లేయర్లు ఫైనల్ మ్యాచ్ ఆడనున్నారు. దీంతో ఈ రోజు కూడా భారత్ కు భారీగానే పతకాలు రానున్నాయి.

Next Story