ఏషియన్ పారా కానోయింగ్ టోర్నీలో భారత్‌పై పతక వర్షం

by Dishanational3 |
ఏషియన్ పారా కానోయింగ్ టోర్నీలో భారత్‌పై పతక వర్షం
X

దిశ, స్పోర్ట్స్ : జపాన్‌లోని టోక్యోలో జరుగుతున్న ఏషియన్ పారా కానోయింగ్ స్ప్రింట్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు. శనివారం ఒక్క రోజే 10 పతకాలు కొల్లగొట్టారు. అందులో నాలుగు స్వర్ణాలు ఉండటం విశేషం. సురేందర్ కుమార్(వీఎల్1 పురుషుల 200 మీటర్లు), జైదీప్(వీఎల్‌3 పురుషుల 200 మీటర్లు), పూజా ఓజా(కేఎల్1 మహిళల 200 మీటర్లు), ప్రాచి యాదవ్(కేఎల్2 మహిళల 200 మీటర్లు) బంగారు పతకాలు సాధించారు. అలాగే, షబాన(కేఎల్3 మహిళల 200 మీటర్లు), రజనీ ఝా(కేఎల్2 మహిళల 200 మీటర్లు), సొనాల్‌బెన్ రతీలాల్ వసోయా(కేఎల్1 మహిళల 200 మీటర్లు), యశ్ కుమార్(వీఎల్1 పురుషుల 200 మీటర్లు), గజేంద్ర సింగ్(వీఎల్2 పురుషుల 200 మీటర్లు) రజతం దక్కించుకోగా.. సంగీత రాజ్‌పుత్(కేఎల్3 మహిళల 200 మీటర్లు) కాంస్య పతకం సాధించింది.



Next Story

Most Viewed