భారత క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ ఓపెనర్ సునీల్ గవాస్కర్ పుట్టినరోజు

by Prasanna |
భారత క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ ఓపెనర్ సునీల్ గవాస్కర్ పుట్టినరోజు
X

దిశ, ఫీచర్స్: సునీల్ గవాస్కర్ నేడు తన 75 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అతని కుటుంబానికి క్రీడా రంగంతో విడదీయలేని బంధం ఉంది. క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించడంలో భారత మాజీ కెప్టెన్ గవాస్కర్ కీలక పాత్ర పోషించాడు. అతని శైలి పూర్తిగా భిన్నంగా ఉండేది. ఈ కారణంగా, అతన్ని లిటిల్ మాస్టర్ అని పిలిచే వాళ్ళు. క్రికెట్ ఫీల్డ్‌ని వదిలి 30 ఏళ్లు దాటింది. అయితే, అతని క్రేజ్ మాత్రం కొంచం కూడా తగ్గలేదు. రిటైర్ అయిన తర్వాత కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. వన్డే ల్లో సక్సెస్ కాలేక పోయిన టెస్ట్ మ్యాచుల్లో మాత్రం చెరగని ముద్ర వేసుకున్నాడు. మన ఇండియా తరపున 127 టెస్టులాడిన సునీల్ గవాస్కర్ 10,122 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లో 10వేల పరుగులు చేసి తొలి క్రికెటర్‌గా రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం, ప్రముఖ టీవీ ఛానెల్స్ లో క్రికెట్ కామెంటేర్‌గా చేస్తున్నాడు.

Advertisement

Next Story

Most Viewed