బ్రిక్స్ గేమ్స్‌లో భారత్‌ ఖాతాలో 29 పతకాలు

by Harish |
బ్రిక్స్ గేమ్స్‌లో భారత్‌ ఖాతాలో 29 పతకాలు
X

దిశ, స్పోర్ట్స్ : రష్యాలో జరిగిన బ్రిక్స్ గేమ్స్‌‌లో భారత అథ్లెట్లు సత్తాచాటారు. 29 పతకాలతో భారత్ 8వ స్థానంలో నిలిచింది. ఇందులో మూడు స్వర్ణాలు, ఆరు రజతాలు, 20 కాంస్య పతకాలు ఉన్నాయి. బాక్సింగ్‌లో అత్యధికంగా 10 పతకాలు దక్కాయి. మీనాక్షి(మహిళల 48 కేజీలు), అనామిక(మహిళల 50 కేజీలు) గెలుచుకున్నారు. రెండు స్వర్ణాలతోపాటు మూడు రజతాలు, ఐదు కాంస్యాలు భారత్ ఖాతాలో చేరాయి. వుషు‌లో అపర్ణ(వుషు సాండా 48 కేజీల కేటగిరీ) గోల్డ్ మెడల్ సాధించగా.. ఆ క్రీడలో మరో మూడు రజత పతకాలు దక్కాయి. ఫెన్సింగ్‌‌లో మూడు, అథ్లెటిక్స్‌లో మూడు, టేబుల్ టెన్నిస్‌లో రెండు, టెన్నిస్‌లో రెండు, రోయింగ్‌లో ఒకటి బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు.Next Story

Most Viewed