రసవత్తర పోరు.. రెండో టీ20 టీమిండియాదే

by Disha Web |
రసవత్తర పోరు.. రెండో టీ20 టీమిండియాదే
X

దిశ, వెబ్‌డెస్క్: నాగ్ పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టు 8 ఓవర్లలో 90 పరుగులు చేసింది. ఆ తర్వాత 91 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 7.2 ఓవర్లలో 92 పరుగులు చేసి గెలుపొందింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లలో వేడ్ 20 బంతుల్లో 43 పరుగులు చేయగా.. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ 2 వికెట్లు, బూమ్రా ఒక వికెట్ తీశారు. భారత బ్యాట్స్ మెన్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 20 బంతుల్లో 46 పరుగులు చేశాడు. చివరిలో దినేశ్ కార్తీక్ 2 బాల్స్‌కు 10 కొట్టాడు.

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed