విజృంభించిన కోహ్లీ, సూర్య.. టీమిండియా ఘన విజయం..

by Disha Web |
విజృంభించిన కోహ్లీ, సూర్య.. టీమిండియా ఘన విజయం..
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఓపెనర్ కెమరూన్ గ్రీన్ (52) పరుగులతో టీమిండియా బౌలర్లపై విజృంభించాడు. ఆరోన్ ఫించ్ 7 పరుగులకే అవుట్ అయ్యాడు. మిడిల్ ఆర్డర్ పేలవ ప్రదర్శన చేయగా.. ఆ తర్వాత వచ్చిన టీమ్ డేవిడ్ (54) , జోష్ ఇంగ్లిస్ (24), డేనియల్ సామ్స్ (28 ) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో ఆస్ట్రేలియా 186 పరుగులకే కుప్పకూలింది.

టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్, హర్షల్ పటేల్, చహల్ చెరో ఒక్క వికెట్ తీశారు. 187 లక్ష్య చేధనతో బరిలోకి టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ విఫలం అయ్యారు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ (63), సూర్య కుమార్ యాదవ్ (69) పరుగులతో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించారు. హర్దిక్ పాండ్యా (25) పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఆస్ట్రేలియా బౌలర్లలో డేనియల్ సామ్స్ 2, హజల్‌వుడ్ 1, పాట్ కమ్మిన్స్ 1 వికెట్ తీశారు.

Job Notifications Latest Current Affairs 2022


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed