- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
రెండో టెస్టులో భారీ విజయం.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్..!
దిశ, వెబ్ డెస్క్: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను ఇండియా జట్టు 2-0 తేడాతో కైవసం చేసుకుంది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో భారత్ తమ అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ విజయానికి ముందు, భారత్ వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరుకోవడానికి తమ మిగిలిన టెస్ట్ మ్యాచ్‌లలో నాలుగు విజయాలు సాధించాల్సి ఉండగా.. 95 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేదించి విజయం సాధించింది. కాన్పూర్‌లో విజయంతో భారత్ మరో మూడు విజయాలు సాధిస్తే నేరుగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కు చేరుకుటుంది. బంగ్లాదేశ్ తో విజయం అనంతరం.. భారత్ 74.24 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా (62.50%) పాయింట్లు శ్రీలంక (55.56%) పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
కాగా, రెండో టెస్టుకు ముందు ఐదో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ ఈ ఓటమి తర్వాత ఏడో స్థానానికి పడిపోయింది. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వరుసగా నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో ఉన్నాయి. ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లే ముందు భారత్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. అయితే గతంలో భారత జట్టు 2021, 2023లో రెండు WTC ఫైనల్స్ ఆడింది. కాగా ఆ రెండు రెండు ఫైనల్ మ్యాచ్ లోనూ ఒకసారి న్యూజిలాండ్, మరోసారి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి WTC టైటిల్ ను చేజార్చుకుంది. అయితే ఈ సారి మాత్రం కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ ఎలాగైన భారత్ కు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని అందించి.. రిటైర్మెంట్ తీసుకొవాలని బావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.