అతడు లేకుండా వరల్డ్ కప్ భారత్.. ఎవరో తెలీదన్న రోహిత్..

by Disha Web |
అతడు లేకుండా వరల్డ్ కప్ భారత్.. ఎవరో తెలీదన్న రోహిత్..
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ కప్‌ను ప్రతి జట్టు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో ఎలాగైనా విజయం సాధించాలని కసరత్తులు చేస్తున్నాయి. అయితే ఆస్ట్రేలియాలో జరగనున్న ఈ టోర్నీలో పాల్గొనేందుకు భారత్ మరో 24 గంటల్లో బయలుదెరనుంది. అయితే ఈ టోర్నీకి 18 మంది ఆటగాళ్లతో భారత్ వెళుతోంది. కానీ భారత్ తన 15 ప్లేయర్ లేకుండానే ఆస్ట్రేలియాకు పయణం అవుతుంది. వరల్డ్ కప్ టీం నుంచి బుమ్రా నిష్క్రమించడంతో అతడి స్థానం ఇంకా బర్తీ కాలేదు. దీంతో భారత్ అతడి స్థానంలో మరో ఆటగాడు లేకుండానే భారత్ వెళ్లనుంది.

దీనిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. బుమ్రా స్థానంలో మరో అనుభవం ఉన్న ఆటగాడు కావాలి. మరి అతడు ఎవరన్నది ఇంకా తెలీదు అని చెప్పుకొచ్చాడు. దీంతో కేవలం 14 మంది ప్లేయర్లతోనే భారత్ వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు వెళ్తుండగా, ఆ 15వ ప్లేయర్ ఎప్పుడు జాయిన్ అవుతాడని నెట్టింట తెగ చర్చలు జరుగుతున్నాయి. అంతేకాకుండా బుమ్రా స్థానంలో ఎవరు ఉంటారని కూడా అభిమానులు తీవ్రంగా చర్చిస్తున్నారు.

Next Story

Most Viewed