- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
సొంత గడ్డపై చరిత్ర సృష్టించిన భారత్
దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఇంగ్టాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టుమ్యాచ్‌లో ఇంగ్లాండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని చేదించి.. ఐదు వికెట్ల తేడాతో గెలిచి ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ను.. 3-1 తేడాతో కైవసం చేసుకుంది. దీంతో భారత్ సొంత గడ్డపై వరుసగా 17వ టెస్టు సిరీస్ ను కైవసం చేసుకుంది భారత జట్టు. రోహిత్, షమీ, అశ్విన్, జడేజా మినహా అందరూ యువ ప్లేయర్లతో ఇంగ్లాండ్ వంటి పెద్ద జట్టుపై భారత్ టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. కాగా 2013 నుంచి 2024 వరకు భారత్ ఈ ఫీట్ ను సాధించి సొంతగడ్డపై అత్యధిక సిరీస్ (17)లు కైవసం చేసుకున్న జట్టుగా భారత్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా 10, వెస్టిండీస్ 8, న్యూజిలాండ్ 8 వరుస టెస్ట్ సిరీస్ లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.