IND vs ENG ODI: ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేసిన భారత్.. టార్గెట్ ఎంతంటే..?

by Mahesh |   ( Updated:2025-02-06 12:02:08.0  )
IND vs ENG ODI: ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేసిన భారత్.. టార్గెట్ ఎంతంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం భారత్ టూర్ లో కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే టీ20 సిరీస్ పూర్తవ్వగా నేటి నుంచి వన్డే సిరీస్ (ODI series) ప్రారంభం అయింది. ఇందులో భాగంగా ఈ రోజు మొదటి వన్డే మ్యాచ్ (First ODI match) నాగ్‌పూర్ వేదికగా జరిగింది. ఈ మ్యాచులో గెలిచిన ఇంగ్లాండ్ జట్టు (England team) బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బౌలింగ్ (India bowling)చేయగా.. ఇంగ్లాండ్ బ్యాటర్లను తమ బంతులతో బౌలర్లు ఇబ్బంది. పెట్టారు. మొదట సాల్ట్, డకెట్ మొదటి వికెట్ కు 75 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. స్కోర్ భారీగా ముందుకు పోతున్న క్రమంలో.. సాల్ట్ 43 పరుగులకు రన్ అవుట్ (Run out) కావడంతో మ్యాచ్ భారీ మలుపు తిరిగింది. దీంతో వెంటవెంటనే ఇంగ్లాండ్ జట్టు (England team) వికెట్లు కోల్పోవడం ప్రారంభించింది.

ఆ తర్వాత కెప్టెన్ బట్లర్ (Captain Butler) 52 పరుగులతో జట్టును ఆదుకోగా జాకోబ్ బెతేల్ (Jacob Bethel) 51 పరుగులతో నిలకడగా ఆడాడు. అలాగే డకేట్ 32 పరుగులు చేయగా.. చివర్లో ఆర్చర్ 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 3, జడేజా 3 వికెట్లు తీసుకొగా.. షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లు ఒక్కో వికెట్ తీసుకున్నారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 47. 4 ఓవర్లకు 248 పరుగుల వద్ద ఆలౌట్ (All out)అయింది. కాగా ఈ మ్యాచులో భారత్ విజయం సాధించాలంటే.. 300 బంతుల్లో 249 పరుగులు చేయాల్సి ఉంది. మరీ సాధారణ లక్ష్య చేధనలో భారత బ్యాటర్లు (Indian batters) ఏ విధంగా రాణిస్తారో తెలియలంటే మ్యాచ్ చూడాల్సిందే.

భారత జట్టు : రోహిత్ శర్మ (సి), యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్ (వికె), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ

ఇంగ్లాండ్ జట్టు : బెన్ డుక్వేట్, ఫిలిప్ సాల్ట్ (వారం), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బుట్టలేరు (సి), లియోన్ లివింగ్‌స్టన్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్స్, జోఫ్రీ ఆర్చర్, ఆదిల్ రషీద్, షకీబ్ మహమూద్

Advertisement
Next Story