చేతులెత్తేసిన కివీస్ బ్యాటర్లు.. టీమిండియా ఘన విజయం

by Dishanational4 |
చేతులెత్తేసిన కివీస్ బ్యాటర్లు.. టీమిండియా ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 90 పరుగుల తేడాతో కివీస్‌పై గెలిచి.. 3-0 తేడాతో టీమిండియా సిరీస్ దక్కించుకుంది. వైట్‌వాష్ చేసేందుకు ఫ్లానింగ్‌తో దిగిన టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసింది. మైదానంలోకి అడుగుపెట్టిన భారత ఓపెనర్లు తొలి బంతి నుంచే దూకుడుగా ఆడి మంచి ఆరంభాన్ని అందించారు.

టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగుల భారీ టార్గెట్ చేసింది. భారీ చేదనకు దిగిన కీవిస్ జట్టు 295 పరుగుల వద్ద ఓటమిపాలైంది. న్యూజిలాండ్‌ ప్రారంభంలోనే వికెట్ కోల్పోయింది. ఫిన్ అలెన్ (0) ఔట్ అవ్వగా.. డెవాన్ కాన్వే భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. హెన్రీ నికోల్స్ భాగస్వామ్యంతో డెవాన్ కాన్వే 100 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్స్‌లతో 138 పరుగులు చేస్తూ చెలరేగిపోయాడు. మరోవైపు హెన్రీ నికోల్స్ అద్భతంగా రాణిస్తూనే(42) పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్‌ బౌలింగ్‌లో ఔట్ కాగా ప్రమాదకర ఇన్నింగ్స్‌కు బ్రేక్ పడింది.

ఇక, తర్వాత వచ్చిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా చేతులెత్తేయడంతో 295 పరుగుల వద్ద కుప్పకూలింది. మైఖేల్ బ్రేస్‌వెల్ (25), మిచెల్ సాంట్నర్ (34 ) పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో ఓటమి పాలైంది. ఇందులో శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ తలా 3 వికెట్లతో ఆదరగొట్టారు. హర్ధిక్ పాండ్యా, చహాల్ ఒక్కొ వికెట్ పడగొట్టారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (101), శుబ్‌మన్ గిల్ (112) శతకాలతో ఆదరగొట్టారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 36 పరుగులతో పర్వాలేదనిపించగా.. చివర్లో పాండ్యా వేగంగా ఆడటంతో భారత్ నిర్ణీత 50 ఓవర్ల 9 వికెట్ల నష్టానికి 385 పరుగుల భారీ స్కోరు చేసింది. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నర్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. మైఖేల్ బ్రేస్‌వెల్ ఒక వికెట్ తీశాడు.

Read Disha E-paper

Next Story

Most Viewed