క్రికెట్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్.. స్టేడియంలోకి ప్రేక్షకుల‌కు అనుమ‌తి

by Disha Web |
క్రికెట్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్.. స్టేడియంలోకి ప్రేక్షకుల‌కు అనుమ‌తి
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా అభిమానులు క్రికెట్‌ను ప్రత్యేక్షంగా వీక్షించలేకపోయారు. అయితే, దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఐపీఎల్ 15 సీజన్‌కు బీసీసీఐ ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతినిచ్చింది. అయితే, పూర్తి స్థాయిలో మాత్రం కాదు. కానీ, ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు పూర్తి స్థాయిలో ప్రేక్షకులను అనుమతిస్తామని చెప్పింది. తాజాగా క్రికెట్ అభిమానులకు బీసీసీఐ మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. స్వదేశంలో భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగే టీ20 సిరీస్‌కు 100 శాతం ప్రేక్షకులకు అనుమతి ఇవ్వనున్నట్లు బీసీసీఐ సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదు కాకపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ సిరీస్‌లో భాగంగా న్యూఢిల్లీ, కటక్, విశాఖపట్నం, రాజ్‌కోట్, బెంగళూరు వేదికల్లో ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. జూన్ 9వ తేదీన సిరీస్ ప్రారంభం కానుండగా.. ఆఖరి మ్యాచ్ 19వ తేదీన జరగనుంది.

Next Story