Ind-Ban: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో పలు రికార్డులు బద్దలు కొట్టిన టీమిండియా

by Maddikunta Saikiran |
Ind-Ban: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో పలు రికార్డులు బద్దలు కొట్టిన టీమిండియా
X

దిశ, వెబ్‌డెస్క్:కాన్పూర్(Kanpur) వేదికగా బంగ్లాదేశ్‌(Bangladesh)తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా(Team India) సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే.ఈ టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ క్రమంలో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-0తో విజయం సాధించి వైట్ వాష్(White wash) చేసింది.ఈ విజయంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(World Test Championship) పాయింట్ల పట్టికలో భారత్ మొదటి స్థానంలో నిలిచింది.ఇదిలా ఉంటే రెండో టెస్టులో భారత పురుషుల క్రికెట్ జట్టు పలు రికార్డులు నమోదు చేసింది.ఈ మ్యాచులో టీమిండియా 90 సిక్సర్లు బాది ఒకే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సిక్సులు బాదిన మొదటి జట్టుగా చరిత్ర సృష్టించింది.ఈ క్రమంలో ఇంగ్లండ్(89) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. అలాగే టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 50,100,200,250 పరుగులు చేసిన తొలి జట్టుగా భారత్‌ రికార్డు సృష్టించింది.

Advertisement

Next Story

Most Viewed