రోడ్నీ మార్ష్, షేన్ వార్న్‌ల మృతిపై క‌పీల్ దేవ్ వ్యాఖ్య‌లు

by Sathputhe Rajesh |   ( Updated:2022-03-05 08:43:54.0  )
రోడ్నీ మార్ష్, షేన్ వార్న్‌ల మృతిపై క‌పీల్ దేవ్ వ్యాఖ్య‌లు
X

దిశ‌, వెబ్‌డెస్క్ః గంట‌ల వ్య‌వ‌ధిలో ఇద్దరు దిగ్గజ ఆస్ట్రేలియా క్రికెటర్లు రోడ్నీ మార్ష్, షేన్ వార్న్‌ల మృతి ప్ర‌పంచ క్రికెట్ అభిమానుల్ని షాక్‌కి గురిచేసింది. వారి మృతిపై ప‌లువురు టాప్ క్రికెట‌ర్లు సంతాపం ప్ర‌క‌టించారు. తాజాగా భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా వారి మృతికి సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలిపారు. "నేను రోడ్ మార్ష్‌తో కలిసి ఆస్ట్రేలియాలోనే నా మొదటి టెస్ట్ సిరీస్ ఆడాను. అత‌ను ఎలాంటి వికెట్ కీపర్... రోడ్, లిల్లీలు ప్రత్యర్థి జట్టుకు చెమ‌ట‌లు పుట్టించిన జోడీ. దాదాపు ఎవ్వ‌రూ సాధించలేని స్థాయిలో రోడ్ వికెట్ కీపింగ్‌కు స‌రికొత్త ప్రమాణాలు నెలకొల్పాడు" అని కపిల్ దేవ్ త‌న ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పేర్కొన్నారు. అలాగే, షేన్‌వార్న్ గురించి ప్ర‌స్తావిస్తూ, "షేన్... ఒక రోజులో ఇద్దరు ఆస్ట్రేలియన్ క్రికెట్ దిగ్గజాలు... షేన్, మీరు మీ జీవితాన్ని కింగ్ సైజ్‌లో జీవించారు. ఈ ఇద్దరు గొప్ప వ్యక్తులకు RIP", అంటూ త‌న ప్ర‌గాఢ సంతాపాన్ని ప్ర‌క‌టించారు. అనుమానాస్పద గుండెపోటు కారణంగా 52 సంవత్సరాల వయస్సులో షేన్ వార్న్ మార్చ్ 4న‌, శుక్రవారం, మరణించగా, అదే రోజు కొన్ని గంట‌ల ముందు 74 ఏళ్ల రోడ్ మార్ష్ కూడా మరణించారు.

Advertisement

Next Story

Most Viewed