- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
ఆ తప్పు చేసి ఉండేది కాదు.. షాహిద్ అఫ్రిది

ఇస్లామాబాద్: ఆ తప్పు చేసి ఉండేది కాదని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఆవేదన వ్యక్తం చేశాడు. 2005లో ఫైసలాబాద్‌లో ఇంగ్లాండ్-పాకిస్తాన్‌కు టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో షాహిద్ అఫ్రిది పిచ్ ట్యాంపరింగ్‌కు పాల్పడటం వల్ల ఒక టెస్టు, రెండు వన్డేలకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని తాజాగా గుర్తు చేసుకున్నాడు. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ తప్పు బాధకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ.. 'ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్ జరుగుతోంది. అప్పుడు నా చేతికి బౌలింగ్ వచ్చింది.
నేను ఎంతో ఫోర్స్‌తో బౌలింగ్ చేసినా పిచ్ అనుకూలించట్లేదు. ఏం చేయాలని అనుకునే సమయంలోనే దగ్గర్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో అందరి దృష్టి అటు వైపు మళ్లింది. నేను షోయబ్ మాలిక్ దగ్గరికి వెళ్లి.. బౌలింగ్‌కు అనుకూలంగా పిచ్‌ను మార్చాలని అనుకుంటున్నానని చెప్పాను. దీనికి ఫోయబ్ మాలిక్ కూడా.. చేసేయ్ ఎవ్వరూ చూడట్లేదని చెప్పాడు. దీంతో పిచ్‌ను మార్చే ప్రయత్నంలో కెమెరాకు చిక్కాను. ఆ రోజు అలా చేయకుంటే ఉంటే బాగుండేది.' అని పేర్కొన్నారు.