క్రికెట్ లో సున్నా పరుగులతో అవుట్ అయితే డకౌట్ అని ఎందుకంటారో తెలుసా?

by Disha Web Desk 3 |
క్రికెట్ లో సున్నా పరుగులతో అవుట్ అయితే డకౌట్ అని ఎందుకంటారో తెలుసా?
X

దిశ డైనమిక్ బ్యూరో: మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ఆటల్లో క్రికెట్ కూడా ఒకటి. ఇక క్రికెట్ ఆడే ఆటగాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అభిమానులను క్రికెట్ ఆటగాళ్లు కలిగి ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే క్రికెట్ మ్యాచ్ లో ఎవరైనా ఆటగాడు సున్నా పరుగులతో అవుట్ అయితే డకౌట్ అయ్యారు అంటారు. కాగా ఈ డకౌట్ అనే పదం తరుచూ వినిపిస్తూనే ఉంటుంది.

అయితే సున్నా పరుగులతో అవుట్ అవ్వడాన్ని డకౌట్ అని ఎందుకంటారు..? డక్ అంటే బాతు.. మరి ఆ బాతుకి క్రికెట్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డకౌట్ అనే పదం వెనుక రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. మొదటి థియరీ ప్రకారం డకౌట్ అసలు పదం డక్స్ ఎగ్ అవుట్. ఆ పదమే కాలక్రమేణా డకౌట్ గా మారింది. కాగా బాతుని ఇంగ్లీష్ లో డక్ అంటారు. ఇక సున్నా బాతుగుట్టు ఆకారంలో ఉంటుంది.

అందుకే డకౌట్ అని పిలిచేవాళ్ళు. ఇక రెండవ థియరీ ప్రకారం.. క్రికెట్ లో ఆటగాడు సున్నా పరుగులతో అవుట్ అయితే డకౌట్ అని అనడం 1866 లో ప్రారంభమైంది. 1866 లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ సున్నా పరుగులతో అవుట్ అయ్యారు. అప్పుడు ఓ పత్రిక ప్రిన్స్ రిటైర్డ్ టూ ది రాయల్ పెవిలియన్ ఆన్ ఏ డక్స్ ఎగ్ అని రాసింది. అప్పటి నుండి అన్ని పత్రికలు అలానే పిలవడం ప్రారంభించాయి. ఆ విధంగా డకౌట్ అనే పదం వాడుకలోకి వచ్చింది.



Next Story

Most Viewed