'వరల్డ్ కప్‌పై మళ్లీ కాళ్లు పెడతా'.. మిచెల్ మార్ష్ సంచలన కామెంట్స్

by Disha Web Desk 13 |
వరల్డ్ కప్‌పై మళ్లీ కాళ్లు పెడతా.. మిచెల్ మార్ష్ సంచలన కామెంట్స్
X

న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ వన్డే వరల్డ్ కప్‌ ట్రోఫీపై కాళ్లు పెట్టి క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. నెట్టింట అతను విమర్శలకు గురయ్యాడు. టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ సైతం అతని తీరును తప్పుబట్టాడు. దాదాపు రెండు వారాల తర్వాత దీనిపై మిచెల్ మార్ష్ స్పందించాడు. తాను చేసిన దానిలో తప్పేం లేదని సమర్థించుకున్నాడు. అవకాశమస్తే మళ్లీ అదే పని చేస్తానంటూ వ్యాఖ్యానించాడు.

తాజాగా ఇంటర్వ్యూలో మిచెల్ మార్ష్ మాట్లాడుతూ..‘ఆ ఫొటోలో ఎలాంటి అగౌరవం లేదు. దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు. దాని గురించే అందరూ చెబుతున్నా నేను సోషల్ మీడియాను ఎక్కువగా చూడలేదు. కానీ, అందులో తప్పేం లేదు.’అని తెలిపాడు. అదే పని చేయాల్సి వస్తే మళ్లీ చేస్తారా? అనే ప్రశ్నకు మిచెల్ స్పందిస్తూ.. చేస్తానంటూ బదులిచ్చాడు. వరల్డ్ కప్ ట్రోఫీపై మళ్లీ కాళ్లు పెడతానని మిచెల్ మార్ష్ వ్యాఖ్యానించడం క్రికెట్ అభిమానుల్లో మరింత ఆగ్రహం వ్యక్తమవుతున్నది.

Next Story