క్రికెట్‌కు హమీష్ రూథర్‌ఫోర్డ్ వీడ్కోలు

by Dishanational3 |
క్రికెట్‌కు హమీష్ రూథర్‌ఫోర్డ్ వీడ్కోలు
X

దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్ క్రికెటర్ హమీష్ రూథర్‌ఫోర్డ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు గురువారం ప్రకటించాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ దేశవాళీ టీ20 టోర్నీ సూపర్ స్మాష్‌ ఆడుతున్న అతను.. ఒటాగో జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ నెల 23న నార్తన్‌ డిస్ట్రిక్స్‌తో జరిగే మ్యాచే అతనికి చివరిది కానుంది. ‘న్యూజిలాండ్‌కు ఆడాలనేది నా కల. క్రికెట్‌కు నాకు, నా కుటుంబానికి ఎంతో ఇచ్చింది. ప్రతి నిమిషం ఆడటాన్ని ఎంజాయ్ చేశా. నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు.’ అని రూథర్‌ఫోర్డ్ తెలిపాడు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రూథర్‌ఫోర్డ్ జాతీయ జట్టు తరఫున ఎక్కువ అవకాశాలు అందుకోలేకపోయాడు. 2019లో శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత అతను పూర్తిగా జట్టుకు దూరమయ్యాడు. 16 టెస్టులు, 4 వన్డేలు, 8 టీ20ల్లో కలుపుకుని 832 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, దేశవాళీలో మాత్రం అతను సత్తాచాటాడు. 130 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 17 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలతో 7,863 రన్స్ చేశాడు. అలాగే, 127 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 13 సెంచరీలతో 4,326 పరుగులు, టీ20ల్లో 192 మ్యాచ్‌ల్లో 141.50 స్ట్రైక్ రేటుతో 4,279 రన్స్ చేశాడు.



Next Story

Most Viewed