గుజరాత్‌ను ఆదుకున్న మూనీ.. యూపీ ముందు టఫ్ టార్గెట్

by Harish |
గుజరాత్‌ను ఆదుకున్న మూనీ.. యూపీ ముందు టఫ్ టార్గెట్
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్-2లో భాగంగా ఢిల్లీ వేదికగా సోమవారం జరుగుతున్న మ్యాచ్‌లో యూపీ వారియర్స్ ముందు గుజరాత్ జెయింట్స్ టఫ్ టార్గెట్ పెట్టింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 152 పరుగులు చేసింది. బెత్ మూనీ(74) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో సత్తాచాటింది. మొదట గుజరాత్‌కు ఓపెనర్లు బెత్ మూనీ, వొల్వార్డ్(43) అదిరిపోయే ఆరంభం అందించారు. ఈ జోడీ తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించింది. అయితే, యూపీ బౌలర్లు పుంజుకుని వరుసగా వికెట్లు తీస్తూ గుజరాత్‌పై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో హేమలత(0), లిచ్‌ఫీల్డ్(4), గార్డ్‌నెర్(15), భారతి ఫుల్మాలి(1) నిరాశపరిచారు. ఈ పరిస్థితుల్లో బెత్ మూనీ ఒంటరి పోరాటం చేసింది. మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా ఆమె యూపీ బౌలర్లపై ఎదురుదాడికి దిగి జట్టును ఆదుకుంది. చివరి వరకు అజేయంగా నిలిచిన ఆమె 52 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్‌తో 74 పరుగులు చేసింది. యూపీ బౌలర్లలో ఎక్లోస్టోన్ 3 వికెట్లు, దీప్తి శర్మ 2 వికెట్లు తీయగా.. గైక్వాడ్‌కు ఒక్క వికెట్ దక్కింది.

Next Story